Monday, 8 December 2025

  *మేము సైతం” అంటూ దొరవారిసత్రం ఎసై సుధాకర్ రెడ్డి, సిబ్బంది మరియు సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా సాయం* *సూళ్ళూరుపేట నియోజకవర్గం* *దొరవారిసత్రం:-* చేసు కోవడానికి చేతిలో పనులు లేక జేబుల్లో పైసలు లేక రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలకు స్థానిక ఎసై యల్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది, సూళ్లూరుపేట పట్టణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు నేడు అనగా శుక్రవారం ఉదయం “మేము సైతం” అంటూ ముందు కొచ్చి తమ వంతు సాయం గా “మనల్ని మనమే కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదిప్పుడు” అని వారికి బియ్యం , కూరగాయలు , కిరాణా వస్తువులను కూలి పనుల నిమిత్తం వచ్చి కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లో భాగం గా బయటకు రాలేక ఇళ్ల లోనే ఉంటూ రోజు కూలీలు ఆకలి తో అలమ టిస్తున్న విషయం తమ ద్రుష్టి కి రాగానే మీడియా సోదరులు స్పందించి వారికి కొంతైన తమవంతు సాయం గా ఈ చిన్ని సహాయం చేయడం పై పలువురు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు . వివరాల్లో కెళితే సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని దొరవారిసత్రం (మండలం) లో రైల్వే కూలి పనుల కోసం బీహార్ , జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చి కరోనా వైరస్ లాక్ డౌన్ లో చిక్కుకుని దిక్కు తోచని స్థితి లో ఉన్న కారణము గా ఇక్కడే చిక్కుపోయిన కూలీల ఆకలి తీర్చడానికి సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు సాహసో పేతమైన పట్టుదల తో మంచి మనస్సు తో ముందుకు వచ్చి నేడు దొరవారిసత్రం పోలీసుల తో కలిసి సంయుక్తం గా జర్నలిస్ట్ లు ఆపదలో ఉన్న కూలీలకు సహాయం చేశారు . ఈ కార్యక్రమం లో స్థానిక ఎస్ ఐ .యల్ సుధాకర్ రెడ్డి చేతుల మీదు గా 40 మంది కూలీ కుటుంబాలకు నెల రోజుల కు సరిపడే బియ్యం తో పాటు కిరాణా వస్తువులు , కూరగాయలు అందించారు . ఆకలి తో ఉన్న కూలీలను మీడియా వారు ఆదుకోవడం పట్ల ఎస్ ఐ . సుధాకర్ రెడ్డి జర్నలిస్ట్ ల నుద్దేశించి “పది మంది కి అన్నం పెట్ట గలిగిన శక్తీ ని భగవంతుడు మీలాంటి జర్నలిస్ట్ లకు ఇచ్చినందుకు నేను మిమ్మల్నెనెంతగానో అభినందిస్తున్నాను . అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కున్నవి రెండే కులాలు . అవేమి టంటే ఒకటి పాజిటివ్ రెండవది నెగిటివ్ . గతం లో అందరు బతికి చచ్చేవారు . కానీ ఇప్పుడు మనం అంటే మనందరం క్షణం క్షణం చస్తూ బతుకు తున్నాం ఎప్పుడెవరికి కరోనా వస్తుందో తెలియక . ముఖ్యం గా కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే మనిషి మనిషి కి రెండు మీటర్లు దూరం , ప్రతి రోజు ఓ గంట యోగ , జలుబు , దగ్గు , తుమ్ములు వచ్చి నప్పుడు నోటికి ఖచ్చిఫ్ పెట్టు కోవడం , , సెల్ ఫోన్ ను రోజు కు ఒక్క సారైన ఖచ్చిఫ్ తో శుభ్రం చేసుకోవడం , వంటివి చేస్తే చాలు . దేశ భద్రత కోసం పోరాట యోధులు ఐన పోలీసు వీరులు , రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న మునిసిపల్ కార్మికులు , తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నడాక్టర్లు , వైద్య సిబ్బంది కి శత కోటి వందనాలు” అంటున్నారు . అలాగే “దేశ భవిత కోసం వారు చేస్తున్న సేవలు అనంతమైన వని చరిత్ర మరువదు వారి సేవలను అని ఈ కరోనా వైరస్ ను అరికట్టాలంటే కొన్ని జాగ్రత్త లు , నివారణా చర్యలు పాటించడం ముఖ్యమని , అలాగే మన దేశ ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ ను మనం గౌరవించి పాటిస్తే ఏ కరోనా మన దరి చేరదని అన్నారు . అభాగ్యులను ఆదుకోవడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావాలని ఎస్ ఐ సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు . ఈ కార్యక్రమం లో ఏ ఎస్ ఐ . చెంగయ్య , పోలిస్ సిబ్బంది మరియు సూళ్ళూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా కి చెందిన వి . రమణయ్య , డి . కిరణ్ , బి . సుధా, సిహెచ్ . గురవయ్య , ఏ . అశోక్ , వి . నాగరాజు కె . జోసఫ్ , యన్ . శ్రీనివాసులు , సర్ధార్ , మూర్తి తదితరులు పాల్గొన్నారు .    

 

*మేము సైతం” అంటూ దొరవారిసత్రం ఎసై సుధాకర్ రెడ్డి, సిబ్బంది మరియు సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా సాయం*

*సూళ్ళూరుపేట నియోజకవర్గం*

*దొరవారిసత్రం:-*

చేసు కోవడానికి చేతిలో పనులు లేక జేబుల్లో పైసలు లేక రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలకు స్థానిక ఎసై యల్ సుధాకర్ రెడ్డి మరియు సిబ్బంది, సూళ్లూరుపేట పట్టణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు నేడు అనగా శుక్రవారం ఉదయం “మేము సైతం” అంటూ ముందు కొచ్చి తమ వంతు సాయం గా “మనల్ని మనమే కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదిప్పుడు” అని వారికి బియ్యం , కూరగాయలు , కిరాణా వస్తువులను కూలి పనుల నిమిత్తం వచ్చి కరోనా వైరస్ మహమ్మారి కట్టడి లో భాగం గా బయటకు రాలేక ఇళ్ల లోనే ఉంటూ రోజు కూలీలు ఆకలి తో అలమ టిస్తున్న విషయం తమ ద్రుష్టి కి రాగానే మీడియా సోదరులు స్పందించి వారికి కొంతైన తమవంతు సాయం గా ఈ చిన్ని సహాయం చేయడం పై పలువురు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు .

వివరాల్లో కెళితే సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని దొరవారిసత్రం (మండలం) లో రైల్వే కూలి పనుల కోసం బీహార్ , జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చి కరోనా వైరస్ లాక్ డౌన్ లో చిక్కుకుని దిక్కు తోచని స్థితి లో ఉన్న కారణము గా ఇక్కడే చిక్కుపోయిన కూలీల ఆకలి తీర్చడానికి సూళ్లూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు సాహసో పేతమైన పట్టుదల తో మంచి మనస్సు తో ముందుకు వచ్చి నేడు దొరవారిసత్రం పోలీసుల తో కలిసి సంయుక్తం గా జర్నలిస్ట్ లు ఆపదలో ఉన్న కూలీలకు సహాయం చేశారు . ఈ కార్యక్రమం లో స్థానిక ఎస్ ఐ .యల్ సుధాకర్ రెడ్డి చేతుల మీదు గా 40 మంది కూలీ కుటుంబాలకు నెల రోజుల కు సరిపడే బియ్యం తో పాటు కిరాణా వస్తువులు , కూరగాయలు అందించారు . ఆకలి తో ఉన్న కూలీలను మీడియా వారు ఆదుకోవడం పట్ల ఎస్ ఐ . సుధాకర్ రెడ్డి జర్నలిస్ట్ ల నుద్దేశించి “పది మంది కి అన్నం పెట్ట గలిగిన శక్తీ ని భగవంతుడు మీలాంటి జర్నలిస్ట్ లకు ఇచ్చినందుకు నేను మిమ్మల్నెనెంతగానో అభినందిస్తున్నాను . అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కున్నవి రెండే కులాలు . అవేమి టంటే ఒకటి పాజిటివ్ రెండవది నెగిటివ్ . గతం లో అందరు బతికి చచ్చేవారు . కానీ ఇప్పుడు మనం అంటే మనందరం క్షణం క్షణం చస్తూ బతుకు తున్నాం ఎప్పుడెవరికి కరోనా వస్తుందో తెలియక . ముఖ్యం గా కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే మనిషి మనిషి కి రెండు మీటర్లు దూరం , ప్రతి రోజు ఓ గంట యోగ , జలుబు , దగ్గు , తుమ్ములు వచ్చి నప్పుడు నోటికి ఖచ్చిఫ్ పెట్టు కోవడం , , సెల్ ఫోన్ ను రోజు కు ఒక్క సారైన ఖచ్చిఫ్ తో శుభ్రం చేసుకోవడం , వంటివి చేస్తే చాలు . దేశ భద్రత కోసం పోరాట యోధులు ఐన పోలీసు వీరులు , రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న మునిసిపల్ కార్మికులు , తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నడాక్టర్లు , వైద్య సిబ్బంది కి శత కోటి వందనాలు” అంటున్నారు . అలాగే “దేశ భవిత కోసం వారు చేస్తున్న సేవలు అనంతమైన వని చరిత్ర మరువదు వారి సేవలను అని ఈ కరోనా వైరస్ ను అరికట్టాలంటే కొన్ని జాగ్రత్త లు , నివారణా చర్యలు పాటించడం ముఖ్యమని , అలాగే మన దేశ ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ ను మనం గౌరవించి పాటిస్తే ఏ కరోనా మన దరి చేరదని అన్నారు . అభాగ్యులను ఆదుకోవడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావాలని ఎస్ ఐ సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు . ఈ కార్యక్రమం లో ఏ ఎస్ ఐ . చెంగయ్య , పోలిస్ సిబ్బంది మరియు సూళ్ళూరుపేట ఎలక్ట్రానిక్ మీడియా కి చెందిన వి . రమణయ్య , డి . కిరణ్ , బి . సుధా, సిహెచ్ . గురవయ్య , ఏ . అశోక్ , వి . నాగరాజు కె . జోసఫ్ , యన్ . శ్రీనివాసులు , సర్ధార్ , మూర్తి తదితరులు పాల్గొన్నారు .


 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.