వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు: నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాలెం సెంటర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
- భారీ వేపచెట్టు వేళ్లతో సహా ఒక్కసారిగా కూలి అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది.ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న మురారి సుబ్బయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
- మరో వ్యక్తి చింతల శ్రీనివాసులుకు కాలు విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు: నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం మాచర్లవారిపాలెం సెంటర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వేపచెట్టు వేళ్లతో సహా ఒక్కసారిగా కూలి అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది.ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న మురారి సుబ్బయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి చింతల శ్రీనివాసులుకు కాలు విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చెట్టు కూలిన సమయంలో బైకు దాని కొమ్మల కింద చిక్కుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనతో మాచర్లవారిపాలెం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మరణించిన వ్యక్తి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.