వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, నవంబరు 25 (పున్నమి): ఆత్మకూరు పరిసర గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది.
- వర్షంతో పలు వీధుల్లో నీరు చేరి రోడ్లు తడిసిపోయాయి.
- వర్షం కురవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వరి సాగు కీలక దశలో ఉండగా, నీటి కొరత కారణంగా అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆత్మకూరు, నవంబరు 25 (పున్నమి):
ఆత్మకూరు పరిసర గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షంతో పలు వీధుల్లో నీరు చేరి రోడ్లు తడిసిపోయాయి. వర్షం కురవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వరి సాగు కీలక దశలో ఉండగా, నీటి కొరత కారణంగా అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షం వ్యవసాయానికి కొంత ఊరటనిచ్చింది. రానున్న రోజుల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురిస్తే సాగునీటి సమస్యలు తగ్గుముఖం పడతాయని రైతులు ఆశిస్తున్నారు. చెరువులు, కుంటల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పండేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.