వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ రాజకీయాల్లో జనసేన జిల్లా నాయకుడు నలిశెట్టి శ్రీధర్ మరోసారి తన నాయకత్వ పటిమను చాటుకున్నారు.
- ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కృషితో జనసేనకు నాలుగు కౌన్సిలర్ స్థానాలు దక్కాయి.వైస్ చైర్మన్ పదవికి పార్టీ అధిష్టానం కొలగాని శిరీషను అభ్యర్థిగా ఖరారు చేయగా, మరో అభ్యర్థి పేరు తెరపైకి రావడంతో రాజకీయ వివాదం నెలకొంది.
- ఈ పరిణామాలపై శ్రీధర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ రాజకీయాల్లో జనసేన జిల్లా నాయకుడు నలిశెట్టి శ్రీధర్ మరోసారి తన నాయకత్వ పటిమను చాటుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కృషితో జనసేనకు నాలుగు కౌన్సిలర్ స్థానాలు దక్కాయి.వైస్ చైర్మన్ పదవికి పార్టీ అధిష్టానం కొలగాని శిరీషను అభ్యర్థిగా ఖరారు చేయగా, మరో అభ్యర్థి పేరు తెరపైకి రావడంతో రాజకీయ వివాదం నెలకొంది. ఈ పరిణామాలపై శ్రీధర్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకత్వం జోక్యంతో ఎన్నికకు మార్గం సుగమమైంది.మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో కూటమి కౌన్సిలర్ల మద్దతుతో కొలగాని శిరీష విజయం సాధించారు. కౌన్సిలర్ స్థానాల సాధనతో పాటు వైస్ చైర్మన్ పదవిని కూడా జనసేన దక్కించుకోవడంతో నలిశెట్టి శ్రీధర్ నాయకత్వంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.