Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అధికారుల తప్పిదాలతోనే ఆత్మకూరులో గందరగోళం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అధికారుల తప్పిదాలతోనే ఆత్మకూరులో గందరగోళం!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో అధికారుల సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం వల్లే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.
  • మంగళవారం వైస్‌ చైర్మన్‌ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.గత రోజు జరిగిన ఎన్నికల ప్రక్రియను అదే రోజు పూర్తి చేసి ఫలితాన్ని ప్రకటించాల్సి ఉండగా, అధికారుల ఆలస్యం కారణంగా ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
  • జనసేన, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సంబంధించిన బీ-ఫారాలతో పాటు మరో బీ-ఫారం అంశం కూడా తెరపైకి వచ్చిందని, ఈ విషయాన్ని అధికారులు ముందుగానే పరిశీలించి సంబంధిత పార్టీలతో చర్చించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఏర్పడేది కాదన్నారు.

వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు, నవంబర్ 24 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో అధికారుల సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం వల్లే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. మంగళవారం వైస్‌ చైర్మన్‌ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.గత రోజు జరిగిన ఎన్నికల ప్రక్రియను అదే రోజు పూర్తి చేసి ఫలితాన్ని ప్రకటించాల్సి ఉండగా, అధికారుల ఆలస్యం కారణంగా ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. జనసేన, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సంబంధించిన బీ-ఫారాలతో పాటు మరో బీ-ఫారం అంశం కూడా తెరపైకి వచ్చిందని, ఈ విషయాన్ని అధికారులు ముందుగానే పరిశీలించి సంబంధిత పార్టీలతో చర్చించి ఉంటే ప్రస్తుత పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. అధికారుల సమాచార లోపం కారణంగా ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఉదయం నుంచి కార్యాలయం వద్దే వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.గత రోజు జరిగిన ఎన్నికల ప్రొసీడింగ్స్‌, వీడియో క్లిప్పింగులు, బీ-ఫారాల స్వీకరణ తేదీ, సమయం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న సభ్యుల వివరాలు, సంతకాలతో కూడిన రికార్డులను అన్ని పార్టీలకు అందించాలని ప్రిసైడింగ్‌ అధికారిని కోరారు. ఎన్నికల ప్రక్రియను గత రోజు నిలిపివేసి, ఈరోజు తిరిగి కొనసాగించడానికి అనుసరించిన చట్టపరమైన నిబంధనలు, సెక్షన్లు, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని సూచించారు.

అన్ని పార్టీలకు పూర్తి నివేదికలు అందించిన అనంతరం ఆయా పార్టీల నాయకత్వాలతో చర్చించుకుని తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలన్నారు. నిన్న వైస్‌ చైర్‌పర్సన్‌గా ప్రకటించిన కత్తి పద్మజకు ఈరోజు ఎదురైన పరిస్థితి బాధాకరమని, ఒకసారి ఎన్నికైనట్లు ప్రకటించిన తర్వాత మళ్లీ వివాదం తలెత్తడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆమెకు కూడా జరిగిన పరిణామాలపై పూర్తి సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.వైస్‌ చైర్మన్‌ పదవి కోసం రాజకీయ పార్టీల మధ్య వివాదాలు కొనసాగడం వల్ల పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఆత్మకూరు ప్రజలు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పదవుల కంటే ప్రజాసేవ, పట్టణ అభివృద్ధే ముఖ్యమని పేర్కొంటూ, అన్ని పార్టీల సభ్యులు సంయమనం పాటించి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బొమ్మిరెడ్డి షకీలా,ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారిణి పావని ,మున్సిపల్ కమీషనరు గంగా ప్రసాద్ తదితరులున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *