Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ విజేతలకు ఘన అభినందన సభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ విజేతలకు ఘన అభినందన సభ

రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ విజేతలకు ఘన అభినందన సభ

విశాఖపట్నం, నవంబర్ 22: నెల్లూరులో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలలో విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన సందర్భంగా, విజేతలకు ఈరోజు ఆదివారం ఉదయం 11 గంటలకు మురళి నగర్ వనిత వాకర్స్ క్లబ్ భవనంలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు.ఈ రాష్ట్రస్థాయి పోటీలలో విశాఖపట్నం జిల్లా నుంచి మొత్తం 43 మంది క్రీడాకారులు పాల్గొని 50 బంగారు పతకాలు, 30 వెండి పతకాలు, 25 కాంస్య పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. అదేవిధంగా మార్చ్ ఫాస్ట్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్‌గా నిలిచిన క్రీడాకారులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 60వ వార్డు కార్పొరేటర్ సనపల వెంకట వర్హ సీతారామయ్య గారు, వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు సుధిత గారు విచ్చేశారు. రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు ముఖ్య అతిథులు మెడల్స్ అందజేసి ఘనంగా అభినందించారు. మార్చ్ ఫాస్ట్‌లో బెస్ట్ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కూడా ప్రత్యేకంగా సత్కరించారు.అలాగే, 2027 జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లో జరగనున్న 46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, జాతీయస్థాయి పోటీలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విశాఖపట్నం జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో VAAV అధ్యక్షులు డాక్టర్ మంగ వరప్రసాద్ గారు, కార్యదర్శి లంక వెంకట సుధాకర్, కోశాధికారి ఎం. రామారావు గారు, కోఆర్డినేటర్ సి.హెచ్. శ్రీనివాస రాజు గారు, రిటైర్డ్ డీసీపీ మహమ్మద్ ఖాన్ గారు, రిటైర్డ్ ఏ.డీ.సీ.పీ డి.వి.ఎస్. భాస్కర్ రాజు గారు, సోములు, మచ్చకొండ, అమరాణి, ప్రభుదత్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారి విజయాలను గుర్తించి సత్కరించడం ద్వారా మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మరింత ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు.విశాఖపట్నం జిల్లా మాస్టర్స్ అథ్లెట్ల విజయ పరంపర జాతీయస్థాయిలో కూడా కొనసాగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ విజేతలకు ఘన అభినందన సభ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *