వార్త ముఖ్యాంశాలు
- 16 మంది వార్డు సభ్యులతో ఎన్నికల సమర శంఖారావం!
- విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 20 :: రామవరం గ్రామపంచాయతీలో ఎన్నికల సందడి ఒక్కసారిగా ఊపందుకుంది.
- సర్పంచ్ అభ్యర్థిగా యర్ర రాజు అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి దిగారు.
16 మంది వార్డు సభ్యులతో ఎన్నికల సమర శంఖారావం!
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 20 ::
రామవరం గ్రామపంచాయతీలో ఎన్నికల సందడి ఒక్కసారిగా ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా యర్ర రాజు అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనతో పాటు గ్రామంలోని 16 మంది వార్డు సభ్యులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేయడంతో రామవరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
సర్పంచ్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని యర్ర రాజు ఎన్నికల సమరానికి సిద్ధమవుతుండగా, 16 మంది వార్డు సభ్యుల నామినేషన్లతో ఆయన బృందం ఎన్నికల బరిలో తన ఉనికిని చాటుకుంది. నామినేషన్ల దాఖలుతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలే ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారనున్నాయి. అభ్యర్థుల ప్రచారం, ప్రజల మద్దతు, ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి గ్రామస్తుల్లో నెలకొంది
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్