వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, ( పున్నమి ప్రతినిధి) నవంబర్ 20:: రామవరంలో సర్పంచ్‌కు 2, శోంఠ్యంలో 5 నామినేషన్లు..
- ఇప్పటివరకు మొత్తం 24 నామినేషన్లు దాఖలు!
- ఆదివారం సోమవారం నామినేషన్లకు మరింత ఊపొచ్చే అవకాశం..
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం, ( పున్నమి ప్రతినిధి) నవంబర్ 20::
రామవరంలో సర్పంచ్‌కు 2, శోంఠ్యంలో 5 నామినేషన్లు.. ఇప్పటివరకు మొత్తం 24 నామినేషన్లు దాఖలు!
ఆదివారం సోమవారం నామినేషన్లకు మరింత ఊపొచ్చే అవకాశం.. భారీగా నామినేషన్లు దాఖలయ్యేనా?
ఆనందపురం మండలంలోని శోంఠ్యం నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని రిటర్నింగ్ అధికారి P.V.S. ఆంజనేయులు వెల్లడించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల వివరాలను తెలియజేస్తూ.. రామవరం గ్రామ సర్పంచ్ స్థానానికి 2 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 16 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
అదేవిధంగా శోంఠ్యం గ్రామ సర్పంచ్ స్థానానికి 5 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానానికి ఒక నామినేషన్ దాఖలైనట్లు వెల్లడించారు.
**మొత్తంగా ఇప్పటివరకు రెండు గ్రామాలకు కలిపి సర్పంచ్ స్థానాలకు 7, వార్డు సభ్యుల స్థానాలకు 17.. మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి.**
ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల కంటే రానున్న ఆదివారం సోమవారం మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలపై పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు చివరి దశలో నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సోమవారం నామినేషన్ కేంద్రం మరింత రద్దీగా మారే అవకాశం కనిపిస్తోంది.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా సాగిందని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్