వార్త ముఖ్యాంశాలు
- ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సందీప్ పంచకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కూటమి శ్రేణులు విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 21:: శోంఠ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ సందడి నెలకొంది.
- కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కోరుకొండ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు.
- గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సందీప్ పంచకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కూటమి శ్రేణులు
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 21::
శోంఠ్యం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల వేళ రాజకీయ సందడి నెలకొంది. కూటమి సర్పంచ్ అభ్యర్థిగా కోరుకొండ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, కూటమి శ్రేణులు ర్యాలీలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. మహిళలు, కార్యకర్తల భాగస్వామ్యంతో నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది.
కూటమి తరఫున తనకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి కోరుకొండ మూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తనపై నమ్మకంతో అభ్యర్థిగా అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు పేర్కొన్నారు.
శోంఠ్యం సర్పంచ్ ఎన్నికల్లో కోరుకొండ మూర్తి నామినేషన్‌తో ఎన్నికల వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో గ్రామంలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారు? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్