కొవ్వూరు, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన కొవ్వూరు జెడ్పీటీసీ బీజేపీ అభ్యర్థి పెరుగు పోతురాజు పలువురు కూటమి నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర సమక్షంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి టీవీ రామారావును కలిశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్