వార్త ముఖ్యాంశాలు
- మదనపల్లె / పుంగనూరు, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి): టమాటా ధరలు రోజురోజుకూ భారీగా పడిపోతుండటంతో స్థానిక రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
- పెట్టిన పెట్టుబడులు, కాయల కోత ఖర్చులు కూడా రాని రీతిలో ధరలు పతనమవడంతో లబోదిబోమంటున్నారు.
- మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మదనపల్లె / పుంగనూరు, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
టమాటా ధరలు రోజురోజుకూ భారీగా పడిపోతుండటంతో స్థానిక రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు, కాయల కోత ఖర్చులు కూడా రాని రీతిలో ధరలు పతనమవడంతో లబోదిబోమంటున్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.