వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
సోమల, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
సోమల మండలం కామిరెడ్డిగారిపల్లె పంచాయతీ సమీపంలోని ఎరమొలపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి కన్యపూజ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో గురుస్వాముల పర్యవేక్షణలో అయ్యప్ప స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు.
ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో 18 మెట్లను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పడిపూజ, కర్పూర హారతులు సమర్పించారు. భక్తుల ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన వితరణ చేపట్టారు. ఈ వేడుకల్లో పరిసర గ్రామాల భక్తులు, అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Uploaded Video:





