వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ద్వారకా తిరుమల, అక్టోబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
“మానవ సేవే మాధవ సేవ” అనే నానుడిని ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో పనిచేస్తున్న గాయత్రి అనే మహిళా ఉద్యోగి నిజం చేసి చూపించారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసి అన్నదాన సత్రంలో భోజనానికి కూర్చున్న ఓ చేతులు లేని వృద్ధ దివ్యాంగ భక్తుడిని ఆమె గమనించారు.
సొంతంగా తినలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ భక్తుడి పరిస్థితిని చూసి చలించిపోయిన ఆమె, వెంటనే స్వయంగా ఆయన వద్దకు వెళ్లి ప్రేమతో ముద్దలు కలిపి తినిపించారు. ఆకలితో ఉన్న దివ్యాంగుడికి తల్లిలా అన్నం పెట్టి ఆమె చాటుకున్న సహృదయత అక్కడున్న భక్తులందరినీ కదిలించింది. గాయత్రి నిస్వార్థ సేవను చూసిన భక్తులు, అధికారులు ఆమెను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది.
Uploaded Video: