Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఆరు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలి**

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆరు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలి**

వార్త ముఖ్యాంశాలు

  • **ఆరు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలి** **తక్షణమే ఐఆర్ ప్రకటించాలి: పెన్షనర్ల సంఘం డిమాండ్** పలమనేరు, అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరులోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం భవనంలో బుధవారం సంఘం అధ్యక్షులు రత్నారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ మధుసూదన్ హాజరయ్యారు అధ్యక్షులు రత్నారెడ్డి మాట్లాడుతూ..
  • ఆందోళనలు, ధర్నాలు చేస్తే తప్ప పీఆర్సీ, డీఏలు సాధించుకోలేమని స్పష్టం చేశారు.

**ఆరు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేయాలి**
**తక్షణమే ఐఆర్ ప్రకటించాలి: పెన్షనర్ల సంఘం డిమాండ్**

పలమనేరు, అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరులోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం భవనంలో బుధవారం సంఘం అధ్యక్షులు రత్నారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ మధుసూదన్ హాజరయ్యారు అధ్యక్షులు రత్నారెడ్డి మాట్లాడుతూ.. ఆందోళనలు, ధర్నాలు చేస్తే తప్ప పీఆర్సీ, డీఏలు సాధించుకోలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, ఇతర ముఖ్యమైన అంశాలపై ఆయన సభ్యులకు వివరించారు. అనంతరం కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ.. పీఆర్సీ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో వెంటనే కొత్త పీఆర్సీని తీసుకురావాలన్నారు. పీఆర్సీ ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేసి, ఈలోగా తక్షణమే మెరుగైన ఐఆర్ (ఇంటీరియమ్ రిలీఫ్ – మధ్యంతర భృతి) ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ మధుసూదన్ మాట్లాడుతూ.. పెన్షనర్లకు బ్యాంకు ద్వారా లభించే సదుపాయాలను వివరించారు. పెన్షనర్ల వ్యక్తిగత రుణాలు, డిపాజిట్లపై అధిక శాతం వడ్డీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 2 లక్షల బీమా కవరేజ్ తదితర ఆర్థిక ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు, సభ్యులు దొరస్వామి, విజయ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, పొనుముడి, సిద్ధ మనోహర్, సుబ్రహ్మణ్యం, రాజన్న, శేఖర్, మురళీధర్, శ్యామరాజు, పీటర్, త్యాగరాజు, లక్ష్మీనరసింహారావు, శ్రీనివాసరావు, పద్మ, పాపయ్య, హరి, గోవిందు, బాబాసాహెబ్, బషీర్ అహ్మద్, కస్తూరి, రవిబాబు, వెంకటరమణ, రాజేంద్ర బాబు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *