వార్త ముఖ్యాంశాలు
- జనసేన చిత్తూరు పార్లమెంట్ నిర్వహాక్ దళ్ సభ్యులుగా జిల్లేడు అరుణ్ కుమార్ నియామకం పలమనేరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి ) : జనసేన పార్టీ చిత్తూరు పార్లమెంట్ నిర్వహాక్ దళ్ సభ్యులుగా పలమనేరు బలిజ సంఘం ఉపాధ్యక్షులు జిల్లేడు అరుణ్ కుమార్ నియమితులయ్యారు.
- పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ జనసేన అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.
- అరుణ్ కుమార్ నియామకం పట్ల పలమనేరు నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే బలిజ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
జనసేన చిత్తూరు పార్లమెంట్ నిర్వహాక్ దళ్ సభ్యులుగా జిల్లేడు అరుణ్ కుమార్ నియామకం
పలమనేరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి ) :
జనసేన పార్టీ చిత్తూరు పార్లమెంట్ నిర్వహాక్ దళ్ సభ్యులుగా పలమనేరు బలిజ సంఘం ఉపాధ్యక్షులు జిల్లేడు అరుణ్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ జనసేన అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించింది.
అరుణ్ కుమార్ నియామకం పట్ల పలమనేరు నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే బలిజ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పట్టణంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు బలిజ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం దక్కడం సంతోషకరమని పేర్కొంటూ పలువురు నాయకులు, స్నేహితులు ఆయనను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.