Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

బురుజుపల్లిలో ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు (గల్లా హరి ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బురుజుపల్లిలో ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు (గల్లా హరి ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ)

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లిమంద (సోమల), అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి): సోమల మండలంలోని నెల్లిమంద పంచాయతీ పరిధిలో గల బురుజుపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి.
  • గ్రామానికి చెందిన గల్లా హరి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఈ పూజా మహోత్సవాన్ని నిర్వహించారు.
  • ఈ సందర్భంగా గురుస్వాముల పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు నిర్వహించారు.

నెల్లిమంద (సోమల), అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
సోమల మండలంలోని నెల్లిమంద పంచాయతీ పరిధిలో గల బురుజుపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన గల్లా హరి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఈ పూజా మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గురుస్వాముల పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలలతో దివ్యంగా అలంకరించి పడిపూజ, దీపారాధనలు చేపట్టారు. భక్తుల ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలు, భక్తి సంకీర్తనలతో ప్రాంగణం మార్మోగింది. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలధారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *