Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మొక్కల లెక్క కాదు.. మనుగడ లెక్కే ముఖ్యం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మొక్కల లెక్క కాదు.. మనుగడ లెక్కే ముఖ్యం!

వార్త ముఖ్యాంశాలు

  • 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు పిలుపునిచ్చారు.
  • మంగళగిరిలోని అరణ్యభవన్‌లో మంగళవారం కమిటీ తొలి సమావేశం జరిగింది.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27లో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయాలని, తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించాలని సూచించారు.

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో మంగళవారం కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27లో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయాలని, తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడంలో సంఖ్య కంటే మనుగడ శాతానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక వాతావరణానికి అనువైన జాతులను ఎంపిక చేసి ‘రైట్ ట్రీ–రైట్ ప్లేస్’ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. రహదారుల వెంట పచ్చదనం, కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు, తాటి తోటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో గ్రీన్ కారిడార్లు అభివృద్ధి చేయాలని సూచించారు. నర్సరీ నుంచి మహావృక్షంగా ఎదిగే వరకు జియో ట్యాగింగ్, డిజిటల్ పర్యవేక్షణ ఉండాలన్నారు. “మనం నాటేది మొక్క కాదు.. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది” అని నాగబాబు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *