Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

అర్చకుల సమస్యలకు పరిష్కారం చూపాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అర్చకుల సమస్యలకు పరిష్కారం చూపాలి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి, అక్టోబర్ 6: అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం యలమంచిలి కొమ్మాయిగుండం వద్ద శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
  • కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి యలమంచిలి, కశింకోట మండలాల నుంచి 60 మందికి పైగా అర్చకులు, సభ్యులు హాజరయ్యారు.
  • వంశపారంపర్య అర్చకుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత, అధికారిక గుర్తింపు కార్డుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

యలమంచిలి, అక్టోబర్ 6: అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం యలమంచిలి కొమ్మాయిగుండం వద్ద శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి యలమంచిలి, కశింకోట మండలాల నుంచి 60 మందికి పైగా అర్చకులు, సభ్యులు హాజరయ్యారు. వంశపారంపర్య అర్చకుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత, అధికారిక గుర్తింపు కార్డుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. దేవాదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో అర్చకులకు కనీస వేతనాలు కూడా అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ నిధులు లేదా వెల్ఫేర్ ఫండ్ ద్వారా అర్చకులకు ప్రతినెలా గౌరవప్రదమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే ఆలయంలో పలువురు వంశపారంపర్య అర్చకులు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎదురవుతున్న సమస్యలపై కూడా చర్చించారు. సమస్యలన్నింటినీ సమగ్ర నివేదికగా రూపొందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం తీర్మానించింది. కార్యక్రమంలో వెలవలపల్లి మృత్యుంజయ శర్మ, సుదర్శనం నారాయణాచార్యులు, నేతేటి గోపాల ఆచార్యులు, రాచకొండ శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *