Saturday, 3 October 2026
  • Home  
  • గాంధీ జయంతి సందర్భంగా నాగులపల్లిలో ఘన నివాళులు
- రంగారెడ్డి

గాంధీ జయంతి సందర్భంగా నాగులపల్లిలో ఘన నివాళులు

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగులపల్లి గ్రామంలో గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ మల్లేపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారని, సత్యం, అహింస సిద్ధాంతాలతో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత మార్గాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పాటించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నరసింహ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగులపల్లి గ్రామంలో గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ మల్లేపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారని, సత్యం, అహింస సిద్ధాంతాలతో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత మార్గాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పాటించాలని సూచించారు.

స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నరసింహ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.