సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రత, నిర్వహణలో ఉత్తమ పనితీరుకు గుర్తింపుగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ – 2026లో ప్రతిష్టాత్మక స్వచ్ఛ బస్టాండ్ అవార్డును సొంతం చేసుకుంది.
తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, డిపో మేనేజర్ కళ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా బస్టాండ్ సిబ్బంది కృషిని అధికారులు అభినందించారు.


