పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)
అనకాపల్లి, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. స్వచ్ఛత కోసం అంకితభావంతో సేవలందించిన 67 మంది స్వచ్ఛ వారియర్స్‌కు అవార్డులు అందజేశారు. ఇందులో ఏటికొప్పాక గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. గిరి ప్రసాద్ రావు స్వచ్ఛత, పారిశుధ్య రంగంలో అందించిన సేవలకు జిల్లా స్థాయి అవార్డు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత భారత్–2047 లక్ష్యానికి అనుగుణంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్–స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీలా గోవింద సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు.


