సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి మార్గాలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలోకి తీసుకురావడమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.| Reporter: Kishore*


