Friday, 2 October 2026
  • Home  
  • మహిళల భద్రతకు ‘అభయ’ అండ!
- అనకాపల్లి

మహిళల భద్రతకు ‘అభయ’ అండ!

ప్రజా రవాణా వాహనాల్లో QR కోడ్‌లు.. వేధింపులపై తక్షణ పోలీసు స్పందన పున్నమి ప్రతినిధి ఆనంద్ అనకాపల్లి: మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అభయ’ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేక చొరవతో ప్రజా రవాణా వాహనాలైన బస్సులు, ఆటోలు, క్యాబ్‌లలో ‘అభయ QR కోడ్’ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై ప్రముఖ సినీ నటులు సాయికుమార్, సుమన్ ప్రత్యేక వీడియో సందేశాల ద్వారా మహిళలకు అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో వేధింపులు లేదా అసౌకర్యం ఎదురైతే వాహనంలోని QR కోడ్‌ను స్కాన్ చేసి పోలీసులకు సమాచారం అందించవచ్చని సూచించారు. QR కోడ్ ద్వారా సమాచారం అందిన వెంటనే కంట్రోల్ రూమ్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం చేరి, సమీప పెట్రోలింగ్ సిబ్బంది స్పందించేలా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం 112, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930కు సంప్రదించాలని సూచించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

ప్రజా రవాణా వాహనాల్లో QR కోడ్‌లు.. వేధింపులపై తక్షణ పోలీసు స్పందన

పున్నమి ప్రతినిధి ఆనంద్

అనకాపల్లి: మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘అభయ’ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేక చొరవతో ప్రజా రవాణా వాహనాలైన బస్సులు, ఆటోలు, క్యాబ్‌లలో ‘అభయ QR కోడ్’ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై ప్రముఖ సినీ నటులు సాయికుమార్, సుమన్ ప్రత్యేక వీడియో సందేశాల ద్వారా మహిళలకు అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో వేధింపులు లేదా అసౌకర్యం ఎదురైతే వాహనంలోని QR కోడ్‌ను స్కాన్ చేసి పోలీసులకు సమాచారం అందించవచ్చని సూచించారు. QR కోడ్ ద్వారా సమాచారం అందిన వెంటనే కంట్రోల్ రూమ్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం చేరి, సమీప పెట్రోలింగ్ సిబ్బంది స్పందించేలా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం 112, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930కు సంప్రదించాలని సూచించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.