Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి అండ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి అండ

వార్త ముఖ్యాంశాలు

  • 63 మంది లబ్ధిదారులకు రూ.42.96 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) ఎలమంచిలి: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు.
  • గురువారం ఎలమంచిలి జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.42,96,820 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

63 మంది లబ్ధిదారులకు రూ.42.96 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

ఎలమంచిలి: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తెలిపారు. గురువారం ఎలమంచిలి జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో 63 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.42,96,820 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
సోమలింగపాలెంకు చెందిన పొలమరశెట్టి సంతోష్‌కుమార్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబ పరిస్థితిని జనసేన నాయకురాలు కర్రి ఝాన్సీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన సహాయాన్ని చెక్కు రూపంలో కుటుంబ సభ్యులకు అందించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *