खबर की मुख्य बातें
- Uploaded Video:
రైతులకు న్యాయం చేయాలని డిమాండ్.. నలుగురు సీపీఎం నాయకుల అరెస్ట్
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
రాంబిల్లి: లారస్ ఫార్మా కంపెనీ కోసం అప్పన్నపాలెం, గోరపూడి, జెడ్ చింతవ గ్రామాల రైతుల భూములను సేకరించే చర్యలను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. రైతులకు మద్దతుగా వెళ్లిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్. శంకరరావు, మండల కార్యదర్శి జి. దేముడు నాయుడు, మండల కమిటీ సభ్యులు ధోని కాశి, ఎర్రిపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి రాంబిల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని పార్టీ పేర్కొంది. సుమారు 576 ఎకరాల జిరాయితీ, ప్రభుత్వ భూముల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపింది. పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలపై రైతులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో భూసేకరణ చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. న్యాయస్థానంలో వ్యవహారం కొనసాగుతుండగా పోలీసు బలగాలను మోహరించి కంచె ఏర్పాటు చేయడం అన్యాయమని విమర్శించింది. రైతులకు న్యాయమైన పరిహారం, పునరావాస ప్యాకేజీలు చెల్లించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Uploaded Video: