వార్త ముఖ్యాంశాలు
- అక్టోబర్ 6 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం 807 ఏ4 మద్యం దుకాణాల తాజా కేటాయింపునకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు పొడిగించింది.
- అక్టోబర్ 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
- అక్టోబర్ 7వ తేదీన దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్ 8వ తేదీన డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి లైసెన్సులు కేటాయించనున్నారు.
అక్టోబర్ 6 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం 807 ఏ4 మద్యం దుకాణాల తాజా కేటాయింపునకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు రోజులు పొడిగించింది. అక్టోబర్ 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 7వ తేదీన దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్ 8వ తేదీన డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి లైసెన్సులు కేటాయించనున్నారు. 807 దుకాణాల్లో 799 ఓపెన్, 8 రిజర్వుడ్ కేటగిరీ దుకాణాలు ఉన్నాయి. 21 ఏళ్లు నిండిన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌రిఫండబుల్ ఫీజు, రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఓపెన్ కేటగిరీకి https://oc.hpfsproject.com, రిజర్వుడ్ కేటగిరీకి https://gk.hpfsproject.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.