Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

బాలికలు క్రీడల్లో రాణించాలి – కొణతాల..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాలికలు క్రీడల్లో రాణించాలి – కొణతాల..

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ జిల్లా బ్యూరో అనకాపల్లి, బాలికలను క్రీడల్లో ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు.
  • కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనకాపల్లి వేల్పుల వీధి కళ్యాణ మండపంలో నేషనల్ వెయిట్ లిఫ్టర్ గుమ్మాల రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల విభాగం అస్మిత ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ డిస్ట్రిక్ట్ లీగ్…
  • తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ జిల్లా బ్యూరో

అనకాపల్లి, బాలికలను క్రీడల్లో ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనకాపల్లి వేల్పుల వీధి కళ్యాణ మండపంలో నేషనల్ వెయిట్ లిఫ్టర్ గుమ్మాల రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల విభాగం అస్మిత ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్ను కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా పెంపొందుతుందని అన్నారు. ఇటీవల క్రీడా రంగంలో మహిళలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు.కబడ్డీ, క్రికెట్, ఆర్చరీతో పాటు వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో బాలికలకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో సాధన చేస్తూ రాణిస్తున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను కొణతాల ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *