Friday, 2 October 2026
  • Home  
  • ఎలమంచిలిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం
- అనకాపల్లి

ఎలమంచిలిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం

పోషక ఆహార మాస ఉత్సవాల్లో భాగంగా వేడుకలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్‌వాడీలదే కీలక పాత్ర పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) ఎలమంచిలి: తులసినగర్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంగన్‌వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి APRDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూ అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లను సత్కరించారు. కార్యక్రమంలో CDPO కె. ఇందిరాదేవి, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి. డేవిడ్, బీజేపీ ఇన్‌చార్జి చిన్నారావు, మున్సిపల్ కమిషనర్, టీడీపీ టౌన్ అధ్యక్షుడు గొర్ల శివ నారాయణమూర్తి (నానాజీ), జనసేన, బీజేపీ నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

పోషక ఆహార మాస ఉత్సవాల్లో భాగంగా వేడుకలు
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్‌వాడీలదే కీలక పాత్ర

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

ఎలమంచిలి: తులసినగర్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంగన్‌వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి APRDC చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్నారులకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూ అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లను సత్కరించారు. కార్యక్రమంలో CDPO కె. ఇందిరాదేవి, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి. డేవిడ్, బీజేపీ ఇన్‌చార్జి చిన్నారావు, మున్సిపల్ కమిషనర్, టీడీపీ టౌన్ అధ్యక్షుడు గొర్ల శివ నారాయణమూర్తి (నానాజీ), జనసేన, బీజేపీ నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.