వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) రాంబిల్లి: ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రాంబిల్లి మండలంలోని లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం, ఎన్‌ఏఓబీ కాలనీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
- పీఏసీఎస్ చైర్మన్ వై.చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం పేదల ఇంటి వద్దకే వెళ్లి అర్హులకు పెన్షన్ అందిస్తూ కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.
- అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు.
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
రాంబిల్లి: ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రాంబిల్లి మండలంలోని లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం, ఎన్‌ఏఓబీ కాలనీల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ వై.చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం పేదల ఇంటి వద్దకే వెళ్లి అర్హులకు పెన్షన్ అందిస్తూ కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, టీడీపీ సీనియర్ నాయకులు వాడ్రర వెంకట్రావు, చెల్లూరు జగ్గారావు, గనగళ్ల కోదండరాం, లంకాడ గోవింద్, ఎరిపిల్లి రాజనాయుడు, ఎరిపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.