పాడేరులో ఇంటర్నేషనల్ యూత్ ఫెస్ట్–2026లో భాగంగా బుధవారం రెడ్ రిబ్బన్ 5కే మారథాన్ నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి హుకుంపేట మండలం బర్మంగూడ వరకు సాగిన పరుగు కార్యక్రమంలో 17–25 ఏళ్ల యువత, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ, పరీక్షల ప్రాధాన్యత, వివక్ష నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు. బాలుర విభాగంలో సీతం, బాలికల విభాగంలో ఎస్. మంజుల ప్రథమ స్థానాలు సాధించారు. సాయికుమార్, ఎస్. మధు ద్వితీయ స్థానాలు పొందారు. విజేతలకు కలెక్టర్ టి. నిషాంతి నగదు బహుమతులు అందజేశారు. చెప్పులు లేకుండా పరుగెత్తి ద్వితీయ బహుమతి సాధించిన ఎస్. మధుకు కలెక్టర్ షూస్ అందించారు. కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి ఎస్. కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

హెచ్ఐవీ అవగాహనకు రెడ్ రిబ్బన్ 5కే మారథాన్