చైర్మన్‌గా జామి సత్యవతి.. వైస్‌చైర్మన్‌గా అర్జిల్లె ఎర్రయ్య
పున్నమి ప్రతినిధి ఆనంద్
రేవు పోలవరం: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో మంగళవారం ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
అనంతరం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఎస్ఎంసీ చైర్మన్‌గా జామి సత్యవతి, వైస్‌చైర్మన్‌గా అర్జిల్లె ఎర్రయ్య ఎన్నికయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి.
నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసీ చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు సభ్యులు పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


