వార్త ముఖ్యాంశాలు
- జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా ఊడీ రామకృష్ణ వైస్ చైర్మన్గా బీసెట్టి అనంతలక్ష్మి పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) ఏటికొప్పాక: పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు, క్రమశిక్షణ, విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఏటికొప్పాక జెడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు.
- చైర్మన్గా ఉడీ రామకృష్ణ (టీడీపీ), వైస్ చైర్మన్గా బీసెట్టి అనంతలక్ష్మి (జనసేన) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- నూతన కమిటీ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల మెరుగుదల, విద్యా వాతావరణం బలోపేతం, పాఠశాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.
జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా ఊడీ రామకృష్ణ
వైస్ చైర్మన్గా బీసెట్టి అనంతలక్ష్మి
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)
ఏటికొప్పాక: పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు, క్రమశిక్షణ, విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఏటికొప్పాక జెడ్పీ హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్గా ఉడీ రామకృష్ణ (టీడీపీ), వైస్ చైర్మన్గా బీసెట్టి అనంతలక్ష్మి (జనసేన) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల మెరుగుదల, విద్యా వాతావరణం బలోపేతం, పాఠశాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును లక్ష్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. కార్యక్రమంలో కూటమి సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు.