ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి నోటిఫికేషన్
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 28: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా తయారీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తిరుమలాయపాలెం ఏఈఆర్వో, తహశీల్దార్ సూచించారు.
2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులై ఉండటంతో పాటు, సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఫారం–18 ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబర్ 6 అని అధికారులు పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు.


