Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

సచివాలయ ఉద్యోగులపై అణచివేత చర్యలు ఆపాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సచివాలయ ఉద్యోగులపై అణచివేత చర్యలు ఆపాలి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి:సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడకు వెళ్లిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేపట్టిన అణచివేత, అక్రమ అరెస్టులకు నిరసనగా సీఐటీయూ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గవరపాలెం పార్క్ సెంటర్‌లోని సచివాలయాల…
  • శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.
  • శంకర్రావు మాట్లాడుతూ..

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

అనకాపల్లి:సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడకు వెళ్లిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేపట్టిన అణచివేత, అక్రమ అరెస్టులకు నిరసనగా సీఐటీయూ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గవరపాలెం పార్క్ సెంటర్‌లోని సచివాలయాల వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీ.వీ. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడటం అన్యాయమన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పెండింగ్ బకాయిలు, ప్రమోషన్లపై ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే వారు ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు.ఉద్యోగులపై నిర్బంధ చర్యలను వెంటనే నిలిపివేసి, సస్పెండ్ చేసిన నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, కాళ్ల తేలయ్య బాబు, అప్పారావు, రాము, ఓం నమశివ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *