Monday, 28 September 2026
  • Home  
  • PM-AJAYతో ఎస్సీ మహిళలకు స్థిరమైన జీవనోపాధి. ఎపిఎం ఆంజనేయులు
- కడప

PM-AJAYతో ఎస్సీ మహిళలకు స్థిరమైన జీవనోపాధి. ఎపిఎం ఆంజనేయులు

(పున్నమి ప్రతినిధి) వేముల మండలం, సెప్టెంబర్ 28: ప్రధానమంత్రి అనుసూచిత జాతుల అభ్యుదయ యోజన (PM-AJAY) ద్వారా షెడ్యూల్డ్ కులాల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి పెంపుదల కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెలుగు–డీఆర్‌డీఏ ఏపీఎం ఆంజనేయులు తెలిపారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను ఉన్నతి నిధులతో అనుసంధానం చేసి అర్హులైన మహిళలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లు చెప్పారు. పెర్నపాడు అంబేద్కర్ స్వయం సహాయక సంఘానికి చెందిన శ్రీమతి గాయత్రి రూ.3 లక్షల ఆర్థిక సహాయంతో ప్యాసింజర్ ఆటో యూనిట్ ఏర్పాటు చేసుకుని స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఇందులో రూ.50 వేల సబ్సిడీ, రూ.30 వేల లబ్ధిదారుని వాటా, రూ.2.20 లక్షల ఉన్నతి నిధులు సున్నా వడ్డీతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ జీవనోపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ గంగరాజు, గ్రామ సమాఖ్య అసిస్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు.

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం, సెప్టెంబర్ 28: ప్రధానమంత్రి అనుసూచిత జాతుల అభ్యుదయ యోజన (PM-AJAY) ద్వారా షెడ్యూల్డ్ కులాల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి పెంపుదల కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెలుగు–డీఆర్‌డీఏ ఏపీఎం ఆంజనేయులు తెలిపారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను ఉన్నతి నిధులతో అనుసంధానం చేసి అర్హులైన మహిళలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లు చెప్పారు. పెర్నపాడు అంబేద్కర్ స్వయం సహాయక సంఘానికి చెందిన శ్రీమతి గాయత్రి రూ.3 లక్షల ఆర్థిక సహాయంతో ప్యాసింజర్ ఆటో యూనిట్ ఏర్పాటు చేసుకుని స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఇందులో రూ.50 వేల సబ్సిడీ, రూ.30 వేల లబ్ధిదారుని వాటా, రూ.2.20 లక్షల ఉన్నతి నిధులు సున్నా వడ్డీతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ జీవనోపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ గంగరాజు, గ్రామ సమాఖ్య అసిస్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.