Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )

అనకాపల్లి: ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహనాలు నడపాలని అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్‌డీపీవో ఆదేశాల మేరకు జిల్లా ఆసుపత్రి వద్ద ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆటోలను బాలకృష్ణ బస్టాప్, ఎన్‌టీఆర్ జంక్షన్, కాంప్లెక్స్ జంక్షన్, కసింకోట బస్‌స్టాప్ ప్రాంతాల్లో నడపాలని సూచించారు. విజయ మెడికల్ సెంటర్ వద్ద ఆటోలు పార్కింగ్ చేయరాదని, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం చేయరాదని హెచ్చరించారు.
అంబులెన్స్‌లను ఎన్‌టీఆర్ ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేయకుండా డీసీఎంఎస్ పార్కింగ్ స్థలంలో నిలిపివేయాలని సూచించారు. ఆసుపత్రి బయట అంబులెన్స్ సదుపాయానికి సంబంధించిన హెల్ప్‌డెస్క్ బోర్డును ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్ డ్రైవర్లు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *