Sunday, 27 September 2026
  • Home  
  • డబుల్ ఇంజిన్ పాలనతోనే ఏపీకి వేగవంతమైన అభివృద్ధి: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డబుల్ ఇంజిన్ పాలనతోనే ఏపీకి వేగవంతమైన అభివృద్ధి: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

ఇందుకూరుపేట: కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటంతో ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ వేగంగా కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఇందుకూరుపేటలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు, తిరుమలలో స్వామివారి ఆశీస్సులు కోరిన విషయాలను గుర్తుచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు సమన్వయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.