వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శనివారం 176 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పరేడ్‌ను వీక్షించారు. ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించారు. అనంతరం మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేలా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, శిక్షణ కేంద్ర అధికారులు పాల్గొన్నారు.

ఖాకీ దళంలోకి 176 మంది.. ఘనంగా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్