ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మొగలి నాగరాజు మృతి బాధాకరం
— ఆర్‌పీఐ (అత్వాలే) నేతల సంతాపం
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26
కడప నగరం కందిపాలెంకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, అంబేద్కర్‌వాది మొగలి నాగరాజు మృతి బాధాకరమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు ఎన్.డి. అజయ్ ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ వై. రమేష్ బాబు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ జ్యోతి జార్జ్, జిల్లా అధ్యక్షుడు ఆకాశి సురేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ దాసరి గాంధీ పేర్కొన్నారు.
ఈ మేరకు వారు సంయుక్త ప్రకటనలో తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మొగలి నాగరాజు గతంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రజా జీవితంలో ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
స్నేహశీలిగా, మంచితనానికి మారుపేరుగా పేరుపొందిన నాగరాజు మృతి దళిత, బహుజన వర్గాలకు తీరని లోటని వారు పేర్కొన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నాగరాజు స్వయంకృషి, కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని న్యాయవాద వృత్తిలో రాణించడంతో పాటు, అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. కడప కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ దళితుల సమస్యలపై న్యాయపరంగా పోరాడారని, అనేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల తరఫున న్యాయ సహాయం అందించారని పేర్కొన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులతో కూడా న్యాయపరంగా పోరాటం చేస్తూ ఎంతోమంది దళితులకు అండగా నిలిచారని తెలిపారు. కడప జిల్లా కోర్టులో ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారని గుర్తుచేశారు.
న్యాయవాదిగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం తన వంతు కృషి చేసిన వ్యక్తిగా మొగలి నాగరాజు సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, నాగరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



