లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో మేకల దేవన్నకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్, టీవీతో పాటు విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.
తనకు జరిగిన నష్టంపై మేకల దేవన్న ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఘటనపై పరిశీలన జరిపి, తమ కుటుంబానికి తగిన సహాయం అందించి న్యాయం చేయాలని కోరారు.
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. రూ.3 లక్షల ఆస్తి నష్టం
లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో మేకల దేవన్నకు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్, టీవీతో పాటు విలువైన వస్తువులు కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. తనకు జరిగిన నష్టంపై మేకల దేవన్న ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఘటనపై పరిశీలన జరిపి, తమ కుటుంబానికి తగిన సహాయం అందించి న్యాయం చేయాలని కోరారు.

