తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ, ఏపీ టూరిజం ప్రత్యేక బస్సు ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. తిరుమలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేలా వివిధ ప్యాకేజీలను రూపొందించారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం నుంచి ప్రతిరోజూ ప్రత్యేక బస్సులు బయలుదేరుతున్నాయి. భక్తులు ఆయా కేంద్రాల్లోనే ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. లోకల్ టెంపుల్స్, నాన్-లోకల్ టెంపుల్స్, శ్రీకాళహస్తి లోకల్ టెంపుల్స్, కాణిపాకం-లోకల్ టెంపుల్స్తో పాటు తిరువణ్ణామలై–గోల్డెన్ టెంపుల్–కాణిపాకం ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమకు అనుకూలమైన ప్యాకేజీని ఎంచుకుని పలు ఆలయాలను సౌకర్యవంతంగా దర్శించుకోవచ్చు.

తిరుపతి నుంచి పలు ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు