మూలజంపలో దుర్గాంబిక అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా స్థాయి పోటీలు
పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)
రాంబిల్లి: రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో శ్రీశ్రీశ్రీ దుర్గాంబిక అమ్మవారి పండగ సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి చెడుగుడు పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం జరుగుతున్న చెడుగుడు పోటీలను యూనిట్ ఇన్చార్జ్ అందుకూరి ప్రసాద్ పరిశీలించారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులతో ముచ్చటించి పోటీల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. దుర్గాంబిక అమ్మవారి పండగలో భాగంగా జరుగుతున్న ఈ జిల్లా స్థాయి పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరవడంతో మూలజంపలో సందడి నెలకొంది.


