Saturday, 26 September 2026
  • Home  
  • బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
- నిర్మల్

బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

సెప్టెంబర్ 25,పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులతో కలిసి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులందరికీ మెనూ ప్రకారం అన్ని వేళల్లో నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి కల్పిస్తూ, మెరుగైన విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ పూర్తి సంఖ్యలో ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న భోజనం, విద్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ, వారికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, అన్ని వసతులు కల్పిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల్లో సిలబస్ ఎంతవరకు పూర్తయిందో అడిగారు. విద్యార్థులందరూ బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ప్రతి సబ్జెక్టుకు తగిన సమయం కేటాయించి, ప్రణాళిక ప్రకారం చదివి, బోర్డు పరీక్షల్లో సత్తా చాటాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. బోర్డుపై విద్యార్థులతో గణిత సమస్యలను సాధింపజేశారు. లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులను బహుమతులుగా ఇచ్చి వారిలో ఉత్సాహం నింపారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ సంతోష్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

సెప్టెంబర్ 25,పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా అధికారులతో కలిసి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులందరికీ మెనూ ప్రకారం అన్ని వేళల్లో నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి కల్పిస్తూ, మెరుగైన విద్యను అందించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ పూర్తి సంఖ్యలో ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న భోజనం, విద్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడుతూ, వారికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, అన్ని వసతులు కల్పిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల్లో సిలబస్ ఎంతవరకు పూర్తయిందో అడిగారు. విద్యార్థులందరూ బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ప్రతి సబ్జెక్టుకు తగిన సమయం కేటాయించి, ప్రణాళిక ప్రకారం చదివి, బోర్డు పరీక్షల్లో సత్తా చాటాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు.
బోర్డుపై విద్యార్థులతో గణిత సమస్యలను సాధింపజేశారు. లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులను బహుమతులుగా ఇచ్చి వారిలో ఉత్సాహం నింపారు.
ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ సంతోష్, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.