సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద గురువారం రాత్రి ఎంవీఐ అనిల్ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ పరిశ్రమకు చెందిన బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగ్వీషర్, డ్రైవర్ల యూనిఫామ్, డాజ్లింగ్ లైట్లు, కాలుష్య సర్టిఫికేట్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.49,000 చలానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
*Time: 09:50 AM, 25th Sep 2026*


