Friday, 25 September 2026
  • Home  
  • ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా దర్గా ప్రారంభోత్సవం.. అగ్రహారం గ్రామంలో పండుగ వాతావరణం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా దర్గా ప్రారంభోత్సవం.. అగ్రహారం గ్రామంలో పండుగ వాతావరణం

జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం గ్రామంలో ముస్లిం సోదరులు నూతనంగా నిర్మించుకున్న దర్గా ప్రారంభోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి దర్గాను ప్రారంభించారు.​కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి గ్రామానికి చెందిన ముస్లిం సోదర, సోదరీమణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దర్గాలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరి వద్దకు స్వయంగా వెళ్లి పలకరిస్తూ ఆప్యాయతను పంచుకున్నారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ:​”నేను పుట్టిన గడ్డపై నన్ను ఎంతగానో అభిమానించే నా ముస్లిం సోదరులు నిర్మించుకున్న దర్గాను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోంది.”​”నా రాజకీయ ప్రయాణంలో నిరంతరం అండగా నిలిచిన ముస్లిం సోదరులను నేను ఎల్లప్పుడూ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను.”​”ముస్లిం సమాజం పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంది. వారి సంక్షేమానికి, అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తాను.”​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు మరియు సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.