Friday, 25 September 2026
  • Home  
  • నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం
- తిరుపతి

నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం

⛔ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి ⛔గిరిజన కార్మికుడి చికిత్సపై కుటుంబ సభ్యుల ఆవేదన.. వైద్య సేవలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి పున్నమి న్యూస్ నాయుడుపేట 📌తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం బిరదవాడ శ్రీనివాసపురం గిరిజన కాలనీకి చెందిన రామయ్య కుటుంబ కలహాల నేపథ్యంలో విషపదార్థం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో శ్రీనివాసపురం నుంచి సమాచారం అందుకున్న బెదవాడకు చెందిన గంగబాబు వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేశారు. 📌నాయుడుపేటలో ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో దొరవారిసత్రం ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 📌అనంతరం అంబులెన్స్ శ్రీనివాసపురానికి చేరుకుని రామయ్యను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. 📌కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆసుపత్రిలో రామయ్యకు చికిత్స అందించిన అనంతరం తిరిగి ఇంటికి పంపించారు. అయితే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 📌ఇంజెక్షన్లు, మందులు అందించినప్పటికీ అవసరమైన స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారా అనే అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. _”*రోగులతో సిబ్బంది వ్యవహారశైలిపై ఫిర్యాదులు*”_ 📌ఆసుపత్రిలో కొంతమంది నర్సులు వైద్యుల సూచనల మేరకు విధులు నిర్వహించకుండా రోగులతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 📌పేషెంట్లతో కోపంగా మాట్లాడటం, వారిపై విరుచుకుపడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొందరు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. 📌ముఖ్యంగా గిరిజన పేషెంట్లను చులకనగా చూస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. 📌రోగులు, వారి బంధువులతో వైద్యులు, నర్సులు, సిబ్బంది మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. _”ప్రతి రోగిని పూర్తిస్థాయిలో పరీక్షించాలి”_ 📌ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యను గుర్తించిన తర్వాతే తగిన చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు. 📌అవసరమైతే సంబంధిత వైద్య నిపుణుల వద్దకు రిఫర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 📌కేవలం లక్షణాలను బట్టి మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడం కాకుండా రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 📌పేదలు, గిరిజనులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారని, వారికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని కోరారు. _”అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి”_ 📌నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, రోగులకు ఎదురవుతున్న సమస్యలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. 📌ముఖ్యంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, నర్సులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. 📌రామయ్యకు అందించిన వైద్య సేవలపై కూడా సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 📌పేదలు,గిరిజనులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలాంటి వివక్షకు గురికాకుండా, గౌరవంగా మరియు అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 📌అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఆసుపత్రి అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

⛔ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

⛔గిరిజన కార్మికుడి చికిత్సపై కుటుంబ సభ్యుల ఆవేదన.. వైద్య సేవలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి

పున్నమి న్యూస్ నాయుడుపేట

📌తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం బిరదవాడ శ్రీనివాసపురం గిరిజన కాలనీకి చెందిన రామయ్య కుటుంబ కలహాల నేపథ్యంలో విషపదార్థం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో శ్రీనివాసపురం నుంచి సమాచారం అందుకున్న బెదవాడకు చెందిన గంగబాబు వెంటనే అత్యవసర సేవలకు ఫోన్ చేశారు.

📌నాయుడుపేటలో ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో దొరవారిసత్రం ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

📌అనంతరం అంబులెన్స్ శ్రీనివాసపురానికి చేరుకుని రామయ్యను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

📌కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆసుపత్రిలో రామయ్యకు చికిత్స అందించిన అనంతరం తిరిగి ఇంటికి పంపించారు. అయితే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

📌ఇంజెక్షన్లు, మందులు అందించినప్పటికీ అవసరమైన స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారా అనే అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

_”*రోగులతో సిబ్బంది వ్యవహారశైలిపై ఫిర్యాదులు*”_

📌ఆసుపత్రిలో కొంతమంది నర్సులు వైద్యుల సూచనల మేరకు విధులు నిర్వహించకుండా రోగులతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

📌పేషెంట్లతో కోపంగా మాట్లాడటం, వారిపై విరుచుకుపడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొందరు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

📌ముఖ్యంగా గిరిజన పేషెంట్లను చులకనగా చూస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

📌రోగులు, వారి బంధువులతో వైద్యులు, నర్సులు, సిబ్బంది మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

_”ప్రతి రోగిని పూర్తిస్థాయిలో పరీక్షించాలి”_

📌ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యను గుర్తించిన తర్వాతే తగిన చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.

📌అవసరమైతే సంబంధిత వైద్య నిపుణుల వద్దకు రిఫర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

📌కేవలం లక్షణాలను బట్టి మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడం కాకుండా రోగి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

📌పేదలు, గిరిజనులు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ప్రధానంగా ఆధారపడుతున్నారని, వారికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా సేవలు అందించాలని కోరారు.

_”అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి”_

📌నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, రోగులకు ఎదురవుతున్న సమస్యలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

📌ముఖ్యంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, నర్సులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.

📌రామయ్యకు అందించిన వైద్య సేవలపై కూడా సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

📌పేదలు,గిరిజనులు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలాంటి వివక్షకు గురికాకుండా, గౌరవంగా మరియు అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

📌అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఆసుపత్రి అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.