అధికారులు ఆన్ డ్యూటీ.. ప్రజల తో కౌన్సిలర్…
బుడమేరు వరద నేపథ్యంలో అప్రమత్తం…!!
ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న మండల రెవిన్యూ అధికారులు..!!
ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో లో బుడమేరు కట్ట తెగుతుంది అనే పుకార్లు నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్థానిక ఖాజీ మాన్యం, జిల్లా పరిషత్ పాఠశాల సమీపం లో ఉన్న బుడమేరు కట్ట పటిష్టత పై ఆరా తీశారు. కట్టకు కొంత మేర కోత ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. ప్రమాదం లేనప్పటికి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కట్ట మీద నివాసం ఉంటున్న ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత అదేశాల మేరకు కౌన్సిలర్ గోపాలరావు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. బుడమేరు కట్ట తెగుతుందని పుకార్లు నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారి అంజయ్య అలాంటి పుకార్లు నమ్మవద్దని వరద పై సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.
సత్య… రిపోర్టర్
మైలవరం




