పున్నమి ప్రతినిధి ఆనంద్ – జిల్లా బ్యూరో
రాంబిల్లి మండల పరిషత్ అధ్యక్షుల (MPP) పదవీకాలం ముగియడంతో మండల పరిపాలనా బాధ్యతలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాంబిల్లి మండల స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి జి. మనోహర్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రాంబిల్లి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు గురువారం జి. మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. నూతన బాధ్యతల్లో జి. మనోహర్ విజయవంతంగా పనిచేయాలని దిన్ బాబు ఆకాంక్షించారు.


