Friday, 25 September 2026
  • Home  
  • ఉదయగిరిలో జరిగే ‘పల్లె పండుగ’ను విజయవంతం చేయాలి: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో జరిగే ‘పల్లె పండుగ’ను విజయవంతం చేయాలి: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పిలుపు

కావలి: సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో ఈ నెల 29వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి టీడీపి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.​ఈ సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారలు ఉమ్మడిగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవబోతోందని అన్నారు. మన ఉమ్మడి జిల్లాకు విచ్చేస్తున్న అధినేతలకు స్వాగతం పలికేందుకు మరియు పల్లె పండుగను జయప్రదం చేసేందుకు కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా కూటమి శ్రేణులు, ప్రజలు తరలివెళ్లాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘పల్లె పండుగ’ ద్వారా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. పల్లెల్లో రవాణా సౌకర్యాలు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి మండలం, పంచాయతీ నుంచి తరలివచ్చే వాహనాలు, కార్యకర్తల సమన్వయం మరియు ఇతర ఏర్పాట్లపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ప్రతి గ్రామం నుంచి అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు.​ఈ పర్యటన ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఐక్యత, గ్రామసీమల అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న పాలనకు ప్రజల మద్దతు స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.​ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రేణులంతా క్రమశిక్షణతో ప్రయాణించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.​ఈ సమీక్షా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, స్థానిక ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

కావలి: సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం, రామాపురం గ్రామంలో ఈ నెల 29వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి టీడీపి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.​ఈ సమావేశంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారలు ఉమ్మడిగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవబోతోందని అన్నారు. మన ఉమ్మడి జిల్లాకు విచ్చేస్తున్న అధినేతలకు స్వాగతం పలికేందుకు మరియు పల్లె పండుగను జయప్రదం చేసేందుకు కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా కూటమి శ్రేణులు, ప్రజలు తరలివెళ్లాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘పల్లె పండుగ’ ద్వారా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. పల్లెల్లో రవాణా సౌకర్యాలు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి మండలం, పంచాయతీ నుంచి తరలివచ్చే వాహనాలు, కార్యకర్తల సమన్వయం మరియు ఇతర ఏర్పాట్లపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ప్రతి గ్రామం నుంచి అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు.​ఈ పర్యటన ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఐక్యత, గ్రామసీమల అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న పాలనకు ప్రజల మద్దతు స్పష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.​ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రేణులంతా క్రమశిక్షణతో ప్రయాణించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.​ఈ సమీక్షా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, స్థానిక ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.