Friday, 25 September 2026
  • Home  
  • శిశు సంరక్షణే అందరి బాధ్యత మంగపేటలో ఘనంగా పోషణ మహోత్సవాలు
- తిరుపతి

శిశు సంరక్షణే అందరి బాధ్యత మంగపేటలో ఘనంగా పోషణ మహోత్సవాలు

ఓబులవారిపల్లి మండలం మంగపేట గ్రామపంచాయతీలో పోషణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ గుణవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి శనివారం పిల్లలకు సులభమైన పద్ధతుల్లో కిట్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల మొదటి, మూడో బుధవారాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులకు అవసరమైన టీకాలు వేయించడం, ప్రతి నెలా బరువులు పరిశీలించడం, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

ఓబులవారిపల్లి మండలం మంగపేట గ్రామపంచాయతీలో పోషణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ గుణవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ప్రతి శనివారం పిల్లలకు సులభమైన పద్ధతుల్లో కిట్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల మొదటి, మూడో బుధవారాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులకు అవసరమైన టీకాలు వేయించడం, ప్రతి నెలా బరువులు పరిశీలించడం, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.